🍥రాత సమస్యల విశ్లేషణ::🍥
**************************
🍥భాషా నైపుణ్యం చదవడం వచ్చిన విద్యార్థులకు రాత సమస్యలు చేయడంలో ఎక్కువ ఇబ్బంది ఉండదు.
🍥సమస్యను చదివిన తర్వాత దానిని విశ్లేషించుకొని ఇచ్చిన సమాచారం లో అవసరమైన వాటిని గుర్తించి సరైన ప్రక్రియ ఎన్నుకోవాలి.
🍥కొన్ని రాత సమస్య లలో సంక్లిష్ఠత ఉంటుంది. అనగా ఓకే సమస్యలో ఒకటి కంటే ఎక్కువ ప్రక్రియలు ఇమిడి ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో విద్యార్థులు ఏ ప్రక్రియ తర్వాత ఏ ప్రక్రియను ఎన్నుకోవాలో నిర్ధారించుకోవాలి.ఇలాంటి సమస్యలు విద్యార్థులకు సవాళ్ళ ను ఎదుర్కునే విధంగా ఉంటాయి.
🍥కాబట్టి ఒక రాత సమస్యను సాధించాలంటే ఒక పద్దతి ప్రకారం వెళ్ళాలి.
🍥 సోపానాలు🍥
**************
సమస్యను కూలంకషంగా చదవడం.
👇
అవసరమైన సమాచారమేది; అవసరం లేని సమాచారం ఏదో గుర్తించడం.
👇
సమస్య ఎన్ని ప్రక్రియలతో కూడి ఉందో గుర్తించడం.
👇
ఏ సందర్భాలతో కూడి ఉందో తెలుసుకోవడం.
👇
ఏ ప్రక్రియ ఎప్పుడు చేయాలో క్రమాన్ని అనుసరించడం.
👇
సరైన పద్దతి ద్వారా సమస్యా సాధనను పూర్తిచేయడం.
No comments:
Post a Comment