Thursday, March 17, 2016

పాఠ్యేతర అంశాలు -పఠన సామాగ్రి 🍥 🍀📚బిగ్ బుక్ 📚🍀

☀రవికిరణ్☀

🍥పాఠ్యేతర అంశాలు -పఠన సామాగ్రి  🍥
*********************************
    🍀📚బిగ్ బుక్ 📚🍀
*********************************
🍀కథలు చదవడం కాలక్షేపానికి కాదు.బొమ్మలతో కూడిన బిగ్ బుక్ ఆధారంగా చదివించడంవలన పిల్లలు తొందరగా చదివే అలవాటుచేసుకుంటారు.

🌹ఉపాధ్యాయులు ఒక సన్నివేశాన్ని ఎంపిక చేసుకొని బోర్డు మీద గీతలతో బొమ్మలు గీస్తూ  నల్ల బల్లనే bigbook రూపొందించవచ్చు.

🍀ఇది పిల్లలను మరింతగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే TLM మొత్తం తన కళ్ళముందే రూపుదిద్దుకోవడంచేత ఇది నాది అనే భావన పిల్లలలో కల్గుతుంది.

🌹అందుచేత ఇష్టంగా చదివి ,పరస్పరం చర్చించడానికి వ్యక్తీకరించడానికి వీలుకలుగుతుంది.

కథలు- ప్రయోజనాలు

☀రవికిరణ్☀
*********************************
🍀🌹కథలు- ప్రయోజనాలు🌹🍀
*********************************

☀ఆలోచనలు రేకెత్తిస్తాయి.

🍀ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి.

🍁తదాత్మ్యతను  కలిగిస్తాయి .

🌹నేను కథలు చెప్పాలి అనే ఆసక్తిని కలిగిస్తాయి.

🍀సంభాషణా చాతుర్యాన్ని పెంచుతాయి.

🍁కథముగింపుతో మానసిక ఆనందాన్ని ,తృప్తిని కలిగిస్తాయి.

🍀సభాకంపం( స్టేజి ఫీయర్) లేకుండా చేసి-భయం లేకుండా మాట్లాడేలా చేస్తాయి.

🌹సృజనాత్మక శక్తిని పెంచుతాయి.

🍁కల్పనా శక్తిని పెంచి పిల్లల్లో అభ్యాసనావేగాన్ని పెంచుతాయి.
*********************************
🍀కథలను ఎలా ఆరంభించాలి🍀
****************************(*****
🌹కథను చక్కని ఎత్తుగడతో ఆరంభించాలి.

🍁హావభావాలు ప్రదర్శిస్తూ స్పష్టంగావినిపించేట్లు అవసరం మేరకు స్వరంలో మార్పులతో పాత్రలకు అనుగుణంగా చెప్పాలి.

☘కథలమధ్యలో పిల్లలను ప్రశ్నించాలి.

⏰"స్లాట్ " అనగా కథను పూర్తిగా ముగించకుండా, పిల్లలకు  Time gap ను  వదిలి చక్కని ముగింపునివ్వమని చెప్పాలి.

⏰"స్లాట్' పిల్లలో ఆలోచనాశక్తిని పెంచుతుంది.

🌹వీలు కలిగితే కథలకు చిత్రరూపాలను బోర్డుమీద లేక చార్ట్ మీద గీసి చెప్పగలిగితే ,
       
           .......లేక.......

🍀పిల్లలను ఆబొమ్మలను చూసి సొంత మాటల్లో చెప్పమని ప్రోత్సహిత్సే వారి మెదడులో విశ్లేషణ అనేభావన స్థిరీకరణ చెందుతుంది.

Wednesday, March 2, 2016

✍PUNCTUATION✍

☀రవికిరణ్ ☀

*********************************
✍PUNCTUATION✍
*********************************
🍥Punctuation is used to create sense, clarity and stress in sentences. You use punctuation marks to structure and organise your writing.

🍥PUNCTUATION RULES IN ENGLISH🍥

🌿the period (or full stop in British English) .

☀the comma,,,

🌿the exclamation mark!!!!

☀the question mark???

🌿the colon :

☀the semicolon;

🌿the quotation mark" "

☀the apostrophe '

🌿the hyphen and the dash
parentheses and brackets
_     -  (  )

🍥 ✍🍥Continue. ..reading. .
Punctuation rules indetail.

🍥The period (known as a full stop in British English) is probably the simplest of the punctuation marks to use.

☀You use it like a knife to cut the sentences to the required length.

🍥Generally, you can break up the sentences using the full stop at the end of a logical and complete thought that looks and sounds right to you.

🍥Although we are often taught that commas are used to help us add 'breathing spaces' to sentences they are, in fact, more accurately used to organise blocks of thought or logical groupings.

☀The exclamation mark is used to express exasperation, astonishment, or surprise, or to emphasise a comment or short, sharp phrase.

🍥Use the question mark at the end of all direct questions.Do not use a question mark for reported questions.Question marks can sometimes appear within sentences

🍥The colon expands on the sentence that precedes it, often introducing a list that demonstrates or elaborates whatever was previously stated.

☀The colon is also used to divide the hour from the minutes in writing a time in English.

🍥The semicolon is somewhere between a full stop and a comma. Semicolons can be used in English to join phrases and sentences that are thematically linked without having to use a conjunction. 

☀Semicolons can also be used instead of commas to separate the items in a list when the items themselves already contain commas .

🍥Use quotation marks to cite something someone said exactly.

🍥The most common use of apostrophes in English is for contractions, where a noun or pronoun and a verb combine. Remember that the apostrophe is often replacing a letter that has been dropped. It is placed where the missing letter would be in that case.

isn't, hasn't, hadn't, didn't, wouldn't, can't

🍥A hyphen joins two or more words together while a dash separates words into parenthetical statements.

🌿The two are sometimes confused because they look so similar, but their usage is different.

☀Hyphens are not separated by spaces, while a dash has a space on either side.

🍥Usually we use square brackets - [ ] - for special purposes such as in technical manuals. Round brackets - ( ) - are used in a similar way to commas when we want to add further explanation, an afterthought, or comment that is to do with our main line of thought but distinct from it. Many grammarians feel that the parentheses can, in fact, be replaced by commas in nearly all cases.

Friday, February 26, 2016

🌸చేద్దాం ..... రండి.... ప్రయోగం --1🌸

☀రవికిరణ్☀

🌻🍥గురుదేవోభవ🍥🌻
*********************************
☀రవికిరణ్☀

🌻🍥గురుదేవోభవ🍥🌻
*********************************
చేద్దాం ..... రండి.... ప్రయోగం
*********************************
వస్తువులు నీటిపై ఎందుకు తేలుతాయి.
*********************************
🍥కావలసిన పరికరాలు:

🌿మూత ఉన్న  ప్లాస్టిక్ సీసా , నీటి బకెట్.

🍥ప్రయోగవిధానం::🍥

☀ప్లాస్టిక్ సీసా తీసుకొని దాని మూతను గట్టిగా బిగించాలి.

🍥ఈసీసా ను బకెట్ లో వేస్తే తేలుతుంది.

☀సీసాను బలంగా నీటిలోకి నెట్టితే ఉర్థ్వ దిశగా బలం
పనిచేసి పైకి నెట్టినట్లు అనిపిస్తుంది.

🌿విషయావగాహన🌿

🍥ఇలా ఊర్థ్వ  దిశలో పనిచేయు బలాన్ని  ఉత్ప్లవన బలం అంటారు.

🌿పరిశీలన::🌿

🍥లోతు పెరిగే కొద్ది  ఉత్ప్లవన బలం పెరుగుతుంది.

🌸చేద్దాం ..... రండి.... ప్రయోగం --2🌸

☀రవికిరణ్☀

🌻🍥గురుదేవోభవ🍥🌻
***********************************
చేద్దాం ..... రండి.... ప్రయోగం
***********************************
జ్వలన ఉష్ణోగ్రత ను అవగాహన చేసుకొనుట
*********************************
🍥కావలసిన పరికరాలు:

🌿రెండు కాగితపు కప్ లు, నీరు, క్యాండిల్స్,త్రిపాదులు.

🌿ప్రయోగవిధానం::🌿

🍥రెండు కాగితపు కప్ లను తీసుకుని వాటిను వేరు, వేరు త్రిపాదులపై ఉంచి, వాటిలో ఒక దానీలో నీరు పోయండి.

☀రెండు కాగితపు కప్ లను ఒకే పరిమాణం గల కొవ్వొత్తులతో వేడి చేయండి.

🌿పరిశీలన::🌿

🍥ఖాళీ పేపర్ కప్ వెంటనే మండిపోతుంది.

☀నీరు ఉన్న పేపర్ కప్ మండదు.

🌿గ్రహించిన విషయం::🌿

🍥మొదటి పేపర్ కప్ ఖాళీ గా ఉంది కాగితం జ్వలన ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వలన త్వరగా మండిపోయినది.

☀కానీ రెండవ కప్పుకు అందించిన ఉష్ణం నీటికి చేరవేయబడినది. నీటి సమక్షంలో ఆ కప్పు జ్వలన ఉష్ణోగ్రత ను చేరుకోలేకపోవడం వలన అది మండలేదు.

☀నిశిత ప్రశ్న:☀
మరి రెండవ కప్పు ఎప్పుడు మండటం ప్రారంభమౌతుందో ఉహించండి?

🍥చేద్దాం ..... రండి.... ప్రయోగం --3🍥

☀రవికిరణ్☀

🌻🍥గురుదేవోభవ🍥🌻
*********************************
చేద్దాం ..... రండి.... ప్రయోగం --3
*********************************
🍥చక్రాల బండి...చలనం🍥
*********************************
🍥కావలసిన పరికరాలు:

🌿చక్రాలబండి, బెలూన్లు, స్ట్రా లు, సెల్ల్లో టేప్, రబ్బర్ బాండ్స్.

🍥ప్రయోగవిధానం::🍥
ఒక కారు బొమ్మ యొక్క పై భాగంను తొలగించి చక్రాలబండి చేసుకోవాలి.

☀స్ట్రాల ను సెల్లో టేపు సహయాంతో బండి మధ్యలో అతికించాలి.

🍥బెలూన్లను రబ్బర్ బ్యాండ్ చేత స్ట్రా లకీ బిగించాలి.

☀స్ట్రాల లో నుండి గాలిని బెలూన్లలోకి గాలి ఊదాలి.

🍥ఒక్క సారిగా బెలూన్ల నుండి గాలిని బయటకు వెళ్ళేటట్లు తెరవాలి.

🌿పరిశీలన::🌿
🍥బండి యొక్క వేగం బెలూన్ల నుండి వచ్చే గాలి పరిమాణానికి అనులోమంగా ఉంటుంది.

☀ బెలూన్ల నింపిన గాలి పరిమాణం లో మార్పు చేస్తే బండి వేగం కూడా మారుతుంది.

Thursday, February 18, 2016

🍥Class room Theatre🍥     *********************

🍥Class room Theatre🍥
    *********************

🏛Class room theatre is an interesting and effective tool that helps to promote and to improve the language skills of the children in English language class room.

🍥It is a specially  scripted version of a story that is easy for a group of  children to read and act dramatically.

🍥In creating class room theatre our main objective is to pick entertaining stories and to convey these stories in a from that is enjoyable both for actors and viewers.
It is the best entertainment in the learning process.

***************************************
🍥Need of class room theatre.🍥

🌸To create interest in language learning.

🌸To draw their attention very easily.

🌸To enrich children for reading practice.

🌸To provide scope for spontaneous production of the language.

🌸To make the class room lively.

🌸To engage children psychologically as well as emotionally

*************************************
🎷Presentation of class room theatre.🎺

1.Identification of the theme.

2.parts of the story.

3.Deciding dramatic events.

4.Fixing the characters.
****************************************
🍥Tips for teachers for successful conduct of class room theatre.🍥

👉Involve majority of the  children.

👉proper planning and practice.

👉reherase the dialogues

👉Emotions and guesters.

👉pronunciation and voice modulation.

****************************************
      📚Good teaching is one forth preparation and three fourths of pure theatre.
              --*Gail God Win*
****************************************

Wednesday, February 17, 2016

🍥సమస్యా సాధన 🍥సామర్థ్యాల పరిపుష్టం🍥

🍥సమస్యా సాధన :: 🍥
      ★★★★★★★

🍥ఒక సమస్యను సాధించడం అంటేకేవలం ఫలితాన్ని రాబట్టడం మాత్రమే కాదు.

🌸సమస్యాసాధన అనేది4 దశలలోజరుగుతుంది. అవి
     
       అవగాహన చేసుకోవడం
                   ⬇
               ప్రణాళిక
                   ⬇
                సాధన
                   ⬇
            పునః సమీక్ష

🍥సమస్యా సాధన నైపుణ్యం పెంపొందించడం ద్వారా పిల్లల లో  ఈ క్రింది సామర్థ్యాలను పరిపృష్టం
చేయవచ్చు.

1.సరైన వ్యూహాలు ఎన్నుకోవడం.

2.అంచనా వేయగలగడం.

3.తప్పు, ఒప్పులను సరిచూడడం.

4.సోపానాలను వివరించగలగడం.

5.తార్కిక ఆలోచన చేయడం.

6.సృజనాత్మకతను ప్రదర్శించడం.

7. నిజజీవితంలో అన్వయించడం.

🍥సమస్యా సాధన విద్యార్థికి తెలిస్తే తనకు ఎదురయ్యే సవాళ్ళ నుసమర్థవంతంగాపరిష్కరించుకోగలుగుతాడు.నిజజీవిత సందర్భాలలో సమర్థవంతంగా వినియోగించుకోగలుగతాడు.

🍥రాత సమస్యల విశ్లేషణ🍥

🍥రాత సమస్యల విశ్లేషణ::🍥
**************************
🍥భాషా నైపుణ్యం చదవడం వచ్చిన విద్యార్థులకు రాత సమస్యలు చేయడంలో ఎక్కువ ఇబ్బంది ఉండదు.

🍥సమస్యను చదివిన తర్వాత దానిని విశ్లేషించుకొని ఇచ్చిన సమాచారం లో అవసరమైన వాటిని గుర్తించి సరైన ప్రక్రియ ఎన్నుకోవాలి.

🍥కొన్ని రాత సమస్య లలో సంక్లిష్ఠత ఉంటుంది. అనగా ఓకే సమస్యలో ఒకటి కంటే ఎక్కువ ప్రక్రియలు ఇమిడి ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో విద్యార్థులు ఏ ప్రక్రియ తర్వాత ఏ ప్రక్రియను ఎన్నుకోవాలో నిర్ధారించుకోవాలి.ఇలాంటి సమస్యలు విద్యార్థులకు సవాళ్ళ ను ఎదుర్కునే విధంగా ఉంటాయి.

🍥కాబట్టి ఒక రాత సమస్యను సాధించాలంటే ఒక పద్దతి ప్రకారం వెళ్ళాలి.
      
      🍥 సోపానాలు🍥
        **************
సమస్యను కూలంకషంగా చదవడం.
               👇

అవసరమైన సమాచారమేది; అవసరం లేని సమాచారం ఏదో గుర్తించడం.
                👇

సమస్య ఎన్ని ప్రక్రియలతో కూడి ఉందో గుర్తించడం.

                  👇
ఏ సందర్భాలతో కూడి ఉందో తెలుసుకోవడం.
  
                    👇
ఏ ప్రక్రియ ఎప్పుడు చేయాలో క్రమాన్ని అనుసరించడం.

                    👇
సరైన పద్దతి ద్వారా సమస్యా సాధనను పూర్తిచేయడం.

Tuesday, February 16, 2016

🍥Tongue twister🍥

       గురుదేవోభవ
  
      Tongue twister::
********************
🍥A Tongue twister is defined as a phrase or sentence that is hard to speak fast, usually because of alliteration or a sequence of nearly similar sounds.

   ::తెలుగు ::
  ***********
🍥రెండు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు.

🍥గాది లోన కందిపప్పు గాది కింద పందికొక్కు.

🍥బుజ్జిగాడు బజ్జీలుతిని బుజ్జిగా బజ్జున్నాడు.

🍥నాని నీ నాన నా నానని నేనన్ననా.

🍥లక్ష్య భక్ష్యములు భక్షించు లక్ష్మయ్య.

🍥నీ నాన్న నా నాన్నని నేనన్నానా.

🍥మేక కొక తోక మేక తోక కొక మేక .

🍥  నాలుగు ఎర్ర లారీలు రెండు పచ్చ లారీలు.

🍥మా నూనె మా నూనె మీ నూనె మీ నూనె.

   ::English::
************

🍥Red blood blue blood.

🍥cute cuddly kittens.

🍥Much mashed mushrooms.

🍥I scream you scream we all scream for ice - cream.

🍥clean clams crammed in clean can.

🍥peter piper picked a peck of pickled peppers.

🍥she sells sea shells by the seashore.

🍥friendly fleas and fire flies.

🍥crisp crusts  crackle and crunch.

🍥Luke luck likes lakes..

🍥Process of conducting Dictation::🍥

Dictation::
*****************
Contemporary dictation test is quite different from the traditional dictation test . Traditional dictation mainly tests spelling.

But the recent type can also test to some extent , punctuation and listening comprehension as well as writing ,reading and grammar.

One passage is to be selected for a class to test the cognitive level of children.

How to conduct  Dictation Test ::

Selected passage is to be read at a normal speed once.

children should listen to it alternatively. They should not write anything

The passage is read again at slightly slower pace but not by word.

Now children should start writing dictation at the same time of second reading.

At the third reading of the teacher the children are to correct the sentences.

Saturday, February 13, 2016

🌺విద్య - విలువలు🌺

🙏చాగంటి  కోటేశ్వరరావు  రావు  గారి  ప్రవచనం.💐

🌻ఇన్ని ఇచ్చినా ఇంకా ఏదో లేదని ఏడుపా!!!🌻

🌺విద్య - విలువలు🌺

🌺ఒక వ్యక్తి సమాజంలో ఆదరణీయంగా బతకాలంటే, ఆదర్శనీయంగా, శాంతికి పర్యాయపదంగా బతకాలంటే రెండు విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని పెద్దలు చెప్పారు. మొదటిది-నేను తెలుసుకుని తీరవలసిన విషయాలలో నాకు తెలిసినది ఎంత? అని ప్రశ్నించుకోవడం. రెండవది-భగవంతుడు నాకు ఇవ్వనిది ఏముంది కనుక! అని కృతజ్ఞతాపూర్వకంగా తృప్తిపడడం.లోకంలో కళ్లు లేని వారు, నోరు, చెవులు ఉండి కూడా మాట్లాడడానికి, వినడానికి నోచుకోని వారెందరో ఉన్నారు. మనం పొందుతున్న సుఖాలలో సగం వాళ్లకు లేవు. అమ్మ నోరారా ‘అమ్మా!’ అని పిలవలేని అసమర్థత ఒకరిది, ఆర్తితో తండ్రి ‘ఒరే కన్నా ఇలా రా!’ అని పిలిస్తే వినలేని దురదృష్టం మరొకరిది. సూర్యోదయాన్ని చూడలేరు, కోయిల గానాన్ని, చిలక పలుకులను వినలేరు, మంచి ఉపన్యాసాలు వినలేరు. ఎన్నో కోల్పోతున్నారు జీవితంలో. వారితో పోల్చుకుంటే మనకు భగవంతుడు ఎన్నో సుఖాలు అధికంగా ఇచ్చాడు.కుటుంబాన్ని పోషించుకోగలిగిన శక్తి ఇచ్చాడు. తల్లిని ఇచ్చాడు, తండ్రిని ఇచ్చాడు. భార్యను ఇచ్చాడు, కొడుకును ఇచ్చాడు, కూతురును ఇచ్చాడు. చేతులూ కాళ్లూ కదపలేని వారెందరో ఉన్నారు. అవి కదలక ఎలక్ట్రిక్ షాక్ పెట్టించుకుంటున్న వాళ్లున్నారు, నాకా పరిస్థితి లేదు. నేను స్వేచ్ఛగా నడవగలుగుతున్నాను. వాళ్లతో పోలిస్తే భగవంతుడు నాకేమి ఇవ్వలేదు కనుక. ఇన్ని ఇచ్చినా ఇంకా లేదని ఏడవడం ఆశకు కారణమౌతుంది. ఆశ అంతులేనిదై పోయిందనుకోండి. అక్కడే నైతిక భ్రష్టత్వమొస్తుంది. కారణం-తనకు లేదన్న ఏడుపే. అది కృతఘ్నత.
వచ్చినదానితో తృప్తితో ఉన్నామనుకోండి. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి! అనుకున్నామకోండి. అది తృప్తికి కారణమౌతుంది. వాడు పక్కవాడి శాంతికి, సమాజ హితానికి కారకుడవుతాడు. నాకు తెలిసినదెంత అన్నవాడు వినయమున్నవాడు. ఈ రెండు లక్షణాలనూ ప్రయత్నపూర్వకంగా ప్రోది చేసుకోమన్నారు.

🌺అంతేకానీ, అవతలివాడు బాధపడుతుంటే వాడిని చూసి సంతోషించగల మనస్తత్త్వం నాలో ఉందనుకోండి. వాడు మరో పావుగంట అలా బాధపడితే బాగుందని చూడడం, దాన్ని సెల్‌ఫోన్లో రికార్డు చేయడం, దాన్ని పదిసార్లు చూకోవడం, దాన్ని నెట్లో, ఫేస్‌బుక్‌లో పెట్టడం చేశాననుకోండి. అంటే నేను చూసిన ఆనందం, రికార్డు చేసిన ఆనందం, దాన్ని లక్షల మందికి చూపిన ఆనందం... అది చివరకు పైశాచిక ఆనందం. అలా కాక ఆ సమయంలో దయ పెల్లుబుకడం ముఖ్యం, అంతేకాదు అవతలివాడి బాధ ఎంత త్వరగా తగ్గించావన్నది మరీ ముఖ్యం.

🌺ఓ రోజున ఒక వృద్ధురాలు రోడ్డు దాటుతూ అరటిపండు తొక్క మీద కాలేసి జారిపడ్డది. ఆ దగ్గర్లోనే నిలుచున్న ఒకావిడ అర్థంపర్థం లేకుండా పమిటకొంగు అడ్డుపెట్టుకుని విరగబడి నవ్వుతున్నది.

🌺ఈలోగా ఒక చిన్న పిల్లవాడు, బహుశా ఎనిమిదో, తొమ్మిదో తరగతి చదివే వయసున్నవాడు పుస్తకాల సంచీ పక్కన పారేసి పరుగు పరుగున ఆ ముసలావిడ దగ్గరకెళ్లి ఆవిడ కాలు పట్టుకుని నెమ్మదిగా రోడ్డు పక్కకు తీసుకువచ్చి కూర్చోబెట్టాడు. నేనూ వెళ్లాను. వాడలా కూర్చోబెట్టి ‘బామ్మగారూ ఇప్పుడెలా ఉంది, తగ్గిందా, నొప్పి ఎక్కువగా ఉందా, బామ్మగారూ మీ ఇల్లు ఇక్కడికి దగ్గరా దూరమా... బస్సెక్కగలరా’ అంటూ అడుగుతున్నాడు. వాడు నన్ను చూసి ‘అంకుల్, మీ దగ్గరేమయినా డబ్బులున్నాయా. బామ్మగారిని ఆటో ఎక్కించేద్దామా?’ అంటున్నాడు. వాడూ సంస్కారవంతుడంటే. ఎప్పుడు ఏ భావన పెల్లుబుకాలో, ఎప్పుడు ఏ భావన పైకి రావాలో అది అలా పైకి రావాలి.

 🌺ఎంగిలి మనసును ఎలా పసిగట్టగలం?🌺

🌺రాకూడని భావన పైకి వస్తుందనుకోండి... అంటే... ఆడదయితే చాలు... లోపలి నుంచి వచ్చే చూపు ఎప్పుడూ ఒకటే... ఏమిటి దానివల్ల ఉపయోగం. ‘మాతృవత్ పరదారేషు..’ భార్య మినహా పరస్త్రీ తల్లితో సమానం’-అంటుంది వేదం. అన్యస్త్రీ కనబడితే చూడడం తప్పు కాదు. చూడు. కానీ

🌺నేను ప్రతిరోజూ తెల్లవారుఝామున నిద్ర లేవగానే ఏ కామాక్షీ పరదేవత ఆరాధన చేస్తానో అ తల్లి ఇన్ని ముఖాలతో కనిపిస్తున్నదని భావన చేశాననుకోండి.... నేను సంస్కారవంతుడిని. నా చూపు వల్ల దోషం రాదు, నేను పతనం కాను. లోచూపుకి సంస్కారం చాలా అవసరం. అది లేదనుకోండి.మాట వెనుక, చూపు వెనుక ఎంగిలి ఉందనుకోండి, ఎంగిలంటే నా ఉద్దేశం- అనుభవించాలన్న కోర్కె. లోపల ఉండే భావాలను ఎవడు పసిగట్టగలడు కనుక. పశువైతే తెలిసిపోతుంది. పశువు చూసే చూపును బట్టి ఇది మీదపడుతుందేమోనని తెలుస్తుంది. కానీ లోపల రాక్షస భావాలను దాచుకుని పైకి ఉత్తమ భావాలను ప్రదర్శించే మనిషి లోచూపును ఎవరు కనిపెట్టగలరు? మీరెంతమంది పోలీసులను పెట్టగలరు? ఈ పరిస్థితి ఎలా మారుతుంది,?

🌺మనిషిలో దేనివలన మానవత్వం మిగులుతుందంటే... ఒక్క సంస్కారం వల్లనే సాధ్యం. ఈ సంస్కారం కోసం చదువు పనికిరావాలి.
విద్య గొప్పదా, సంస్కారం గొప్పదా అంటే సంస్కారం లేని విద్య పతన హేతువవుతుంది. సంస్కారంతో కూడుకున్న విద్య మాత్రమే పదిమందికి పనికి వస్తుంది. రామ లక్ష్మణ భరత శత్రుఘు్నలకు వశిష్ఠుడు పాఠం చెప్పాడు. చెప్పినప్పుడు గురువు ఎలా చెప్పాడు, పాఠం విన్నవాళ్లకు ఎలా అర్థమైందని అడుగుతూ మహర్షి ఇలా అన్నారు.

🌺చదువు ఒకరి నుంచి మరొకరికి ప్రవహించాలన్న మాట వాస్తవమే అయినా, అది అలా ప్రవహించుకుంటూ పోవడం మాత్రమే కాదు. ఒకరి నుంచి మరొకరిలోకి ప్రవహించిన తరువాత అక్కడి నుంచి ఎలా ప్రవహించాలి అన్న విషయానికి ప్రాముఖ్యత ఉంది. అంటే ఉన్న చదువుకు గుణాలు ఆధారం కావాలి. గుణం అంటే ఎప్పుడు మనసులో ఏ భావం కలగాలో ఆ భావన మాత్రమే కలగడానికి ఆ చదువు ఉపయోగపడాలి. నేను ఒక పసిపిల్లవాడి వంక చూశాననుకోండి. వాడు నా మనవడా కాదా అన్నది ప్రధానం కాదు, వాడిపట్ల నాలో వాత్సల్యం పెల్లుబకాలి. నేను ఒక దీనుడి వంక చూస్తే నాలో దయాగుణం పెల్లుబుకాలి.

-Brahmasri Chaganti Koteswararao

Welcome

Welcome to గురుదేవోభవ